Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబో సెట్ అయ్యిందా?

ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబో సెట్ అయ్యిందా?

Aravinda Cambo: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌ అనే సినిమా రూపొంద‌డం.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. ఈ సినిమా టైమ్ లో ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. దీంతో వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవ‌డ‌మే కాదు… ఏకంగా అనౌన్స్ మెంట్ ఇవ్వ‌డం కూడా జ‌రిగింది. అయితే… ఏమైందో ఏమో కానీ.. ఆత‌ర్వాత‌ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

అప్ప‌టి నుంచి ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయ‌ని టాలీవుడ్ లో టాక్ బ‌లంగా వినిపించింది. ఇక భ‌విష్య‌త్ లో కూడా వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ ఉండ‌దేమో అన్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు ఎన్టీఆర్ ను క‌లిసి బ‌ర్త్ డే విషేష్ తెలియ‌చేశారు. అలా ఎన్టీఆర్ ను క‌లిసి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసిన వారిలో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

త్రివిక్రమ్ వెళ్లి శుభాకాంక్షలు తెలియ‌చేయ‌డంతో… ఎన్టీఆర్ కూడా సాదరంగా ఆహ్వానించినట్లు స‌మాచారం. సో.. ఇప్పుడు విబేధాలు అన్నీ ఆటలో అరటిపళ్లే. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌హేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఆ త‌ర్వాత‌ వెంటనే కాకున్నా, మొత్తానికి వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మళ్లీ అరవింద సమేత లాంటి మాంచి బ్లాక్ బస్టర్ ను మనం చూడొచ్చు అని టాక్. ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా, ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నారు. మ‌రి.. ఆత‌ర్వాత ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో మూవీ సెట్స్ పైకి వ‌స్తుందేమో చూడాలి.

Also Read ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్