Friday, October 18, 2024
Homeసినిమామహేశ్ ను మరింత మాస్ గా చూపించిన త్రివిక్రమ్!

మహేశ్ ను మరింత మాస్ గా చూపించిన త్రివిక్రమ్!

మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు రెండు సినిమాలు వచ్చాయి. ‘అతడు’ సినిమా సంచలన విజయాన్ని సాధించగా, ‘ఖలేజా’ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా నిలిచింది. ఆ తరువాత ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటం వలన, గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇంతకాలానికి వీరి కాంబినేషన్ సెట్ అయింది. మహేశ్ హీరోగా ‘గుంటూరు కారం’ సినిమాను త్రివిక్రమ్ రూపొందించాడు. హారిక .. హాసిని బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది.

ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే కొత్త రికార్డులను నమోదు చేయవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు మాస్ లుక్ తో కనిపించనున్నాడు .. మాస్ కంటెంట్ బలంగా ఉందనే విషయం ప్రేక్షకులకు ముందుగానే అర్థమైపోయింది. ఇక పాటలకు కూడా ఒక రేంజ్ లోనే మాస్ టచ్ ఇచ్చారనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మహేశ్ తో డిఫరెంట్ స్టైల్లో త్రివిక్రమ్ డైలాగ్స్ చెప్పించాడని తెలుస్తోంది. ఇక మహేశ్ బాబుతో స్టెప్పులు … ఫైట్లు కూడా మాస్ ఆడియన్స్ పోలోమంటూ థియేటర్స్ కి రప్పించేలానే ఉన్నాయి. ‘చింపుకుని వేసుకున్నారా .. వేసుకుని చింపుకున్నారా’ అనే డైలాగ్స్, మాస్ తో పాటు యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. శ్రీలీల మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఫ్యాన్స్ భావిస్తున్నట్టుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్