Saturday, March 14, 2026
Homeసినిమాఆ రెండు సినిమాలకూ త్రివిక్ర‌మ్ మాటలే!

ఆ రెండు సినిమాలకూ త్రివిక్ర‌మ్ మాటలే!

Dialogues same: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. డైలాగ్ రైట‌ర్ గా ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌కుడు కాకముందు ఆయ‌న డైలాగులు రాసేవారు. అయితే.. ఆయ‌న డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత వేరే సినిమాల‌కు డైలాగ్ రాయ‌డం మానేశారు. ప‌వ‌న్ కోసం జ‌యంత్ డైరెక్ట్ చేసిన తీన్ మార్ మూవీకి, ఇటీవ‌ల‌ భీమ్లా నాయ‌క్ కి డైలాగులు రాశారు. ప‌వ‌న్  మరో రెండు సినిమాలకూ అయన మాటలు సమకూర్చనున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని స‌ముద్రఖ‌ని తెర‌కెక్కించ‌ నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వైష్ణ‌వ్ తేజ్ కాంబినేష‌న్లో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. ఇలా త‌ను డైరెక్ట్ చేయ‌క‌పోయినా ప‌వ‌న్ న‌టించ‌నున్న రెండు సినిమాల‌కు త్రివిక్ర‌మ్ డైలాగులు రాస్తుండ‌డం విశేషం.

Also Read : తోట తరణికి ‘… వీరమల్లు’ టీమ్ సత్కారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular