Friday, September 20, 2024
Homeసినిమాబాలయ్య మూవీ వెనుక త్రివిక్రమ్. బొమ్మ బ్లాక్ బస్టరేనా..?

బాలయ్య మూవీ వెనుక త్రివిక్రమ్. బొమ్మ బ్లాక్ బస్టరేనా..?

బాలకృష్ణ ఇటీవల 109వ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి బాబీ డైరెక్టర్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో బాలయ్యతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడినప్పుడు తీసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించనట్టు తెలుస్తుంది.

త్రివిక్రమ్ భార్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారంటే.. ఖచ్చితంగా స్ర్కిప్ట్ విషయంలో ఆయన హ్యాండ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ చేయిపడితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టే అనే టాక్ ఉంది. భీమ్లా నాయక్ మూవీలో హ్యాండ్ ఉంది.. సినిమా సక్సెస్ అయ్యింది. ఈమధ్య రిలీజైన సార్ మూవీ స్ర్కిప్ట్ లో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది.. ఆ సినిమా తెలుగు, తమిళ్ రెండు చోట్లా సక్సెస్ సాధించింది. బ్రో మూవీలో త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుందని.. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఇప్పటి నుంచే ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ లాంచ్ సమయంలో ఆ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో మాన్షన్ హౌస్ బాటిల్.. కొడవలి.. గొడ్డలి కనపడ్డాయి. దీంతో ఈ మూవీ హింసాత్మకంగా ఉంటుందనే విషయం అర్థం అవుతోంది. మూవీకి కింద క్యాప్షన్ గా వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అని పెట్టడంతో మూవీ లో యాక్షన్ సీన్లు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్ తోనే సినిమా పై మరింతగా అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కుదిరితే సంక్రాంతికి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్