Saturday, November 23, 2024
HomeTrending Newsశాలపల్లిలో టీఆర్ఎస్‌కు ఆదరణ కరువు

శాలపల్లిలో టీఆర్ఎస్‌కు ఆదరణ కరువు

Trs Lost Popularity In Shalapally Itself Which Was Started By Dalitbandhu :

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఆసక్తిని రేపాయి.ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. పథకాన్ని ముందుగా ఎన్నికల సంగ్రామమైన హుజూరాబాద్‌ నుంచే మొదలు పెట్టారు. ఈ పథకంతో దళితుల ఓట్లు తమకే వస్తాయని కేసీఆర్ భావించారు. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనే టీఆర్ఎస్‌కు ఆదరణ కరువైంది. శాలపల్లిలో సీఎం కేసీఆర్ సభ కూడా పెట్టారు. అయినా శాలపల్లి ఓటర్లను టీఆర్ఎస్ ఆకర్షించలేకపోయింది. దళితబంధు ప్రకటించిన శాలపల్లిలోనే టీఆర్ఎస్‌కు తక్కువ ఓట్లు రావడంతో దళితబంధు లబ్దిదారులు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ వేసిన పాచిక పారలేదంటున్నారు.శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. కాగా తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంతూరులో ఈటల ఆధిక్యంతో నిలిచారు. మరోవైపు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ స్వగ్రామం హిమ్మత్‌నగర్‌లో భాజపాకు ఆధిక్యం వచ్చింది. అక్కడ గెల్లు శ్రీనివాస్‌కు 358 ఓట్లు పోలవగా.. ఈటలకు 549 ఓట్లు పడ్డాయి.దీనితో ఇక దళితబందుకు మేఘాలు కమ్ముకుంటాయా?అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 14వ రౌండ్ ముగిసేసరికి 1046 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు. మరో రౌండ్ తో జమ్మికుంట మండలం పూర్తి అవుతుంది. రెండో రౌండ్ మినహా అన్ని రౌండ్ల లో బిజెపి ఆధిక్యం కొనసాగుతోంది.

Must Read :86.57 శాతం పోలింగ్: ఈటెల వైపే మొగ్గు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్