తెలంగాణ భవన్ లో దసరా రోజు (అక్టోబర్ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని టిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని., సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు.
ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 05 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయం లోపే హాజరుకావాలన్నారు. జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో పార్టీ నేతలు కార్యాలయంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియా… వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన నేతలు వస్తారని గులాబీ నేతలు అంటున్నారు.