రేవంత్ రెడ్డి ‘ఫాదర్ ఆఫ్ ఐరన్ లెగ్’ అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పారీ శకం ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ను నియమించడంతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయిందని… ఓటుకు నోటు కేసులో అయన ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితి ఉందని, అలాంటి నేతకు పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. అయన ఒళ్లంతా విశామేనని, మాట్లాడేవన్నీ అబదద్ధాలేనని విమర్శించారు.
సోనియా గాంధీ కుటుంబం అంటే తెలంగాణా ప్రజలకు ఇప్పటివరకూ ఒక అభిమానం ఉండేదని, రేవంత్ నియామకంతో ఆ గౌరవం పోయిందని జీవన్ రెడ్డి అన్నారు. ఆయనకు పదవి ఇవ్వడం ఆ పార్టీలోనే చాలామందికి ఇష్టం లేదన్నారు. కేటిఆర్ ను క్యాట్ వాక్ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డిది జైలు వాక్ అని, అతని ఖైదీ నంబర్ 1799 అని గుర్తు చేశారు. పదవులు వస్తే హుందాతనం పెరగాలని, గొప్పగా మాట్లాడాలని, ప్రజా సమస్యలమీద పోరాటాలు చేయాలి గానీ చిల్లర విమర్శలతో ఒరిగేదేమీ ఉండదని జీవన్ రెడ్డి హితవు పలికారు.