Wednesday, March 26, 2025
Homeతెలంగాణప్రచారం కోసమే ఈ భాష: సుధీర్ రెడ్డి

ప్రచారం కోసమే ఈ భాష: సుధీర్ రెడ్డి

రేవంత్ రెడ్డి రౌడీ భాష మాట్లాడితే ఆ పార్టీలో ఎవరూ మిగలారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ చైర్మన్ డి.సుధీర్ రెడ్డి హెచ్చరించారు. జూలై ఏడున రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కేవలం ప్రచారం కోసమే అయన బజారు భాష మాట్లాడుతున్నాడని సుధీర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అతని కంటే ఎక్కువ ఉరికించి కొట్టించగలమని వ్యాఖ్యానించారు.

కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో  ఉన్నావా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. ప్రజలకు ఏమైనా సహాయం చేసావా అని నిలదీశారు. 2017 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు స్పీకర్ కు ఎందుకు లేఖ ఇవ్వలేదని ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదని సూటిగా అడిగారు.

రేవంత్ బురదలో పంది అని వదిలివేస్తామని మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయన నాలుగు పార్టీలు తిరిగాడని, పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రజల సమస్యలను పట్టించుకోడని, బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తుంటాడని లింగయ్య ఆరోపించారు. తాము కొట్టడం కాదని, ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన్ను చెప్పులతో కొడతారని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్