Sunday, January 19, 2025
HomeTrending Newsతెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Trs Mlc Candidates Finalised :

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తకెళ్ల పల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు చివరిరోజు కావడంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లతో హడావుడి కనిపించింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులందరూ కూడా అసెంబ్లీ సెక్రెటరీ ఛాంబర్ దగ్గరికి చేరుకుంటున్నారు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా బండ ప్రకాశ్ పేరు వినూత్నంగా తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ప్రకాష్ ఇప్పుడు శాసనమండలి కి ఎన్నిక కానున్నారు. ఈటెల రాజేందర్ స్థానంలో ముదిరాజ్ వర్గం నుంచి బండ ప్రకాష్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని తెలిసింది.

Also Read :  ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్