Sunday, January 19, 2025
HomeTrending Newsపార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం

పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించి,పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దీనికి ఉదాహరణ బండా శ్రీనివాస్ నియమాకమే అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాభినందనలు తెలిపారు.

కెసిఆర్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారందరిని గుర్తు పెట్టుకున్నారని, సమయం వచ్చినప్పుడు సముచిత స్థానం కల్పిస్తారని మంత్రి ఈశ్వర్ అన్నారు. వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కెసిఆర్  ప్రజలందరి భద్రత, సంక్షేమం , అభ్యున్నతికి అంకితభావంతో ముందుకు సాగుతున్నారన్నారు. బాలకిషన్ మాట్లాడుతూ, దళిత బంధు వంటి పథకం ప్రపంచం లో మరెక్కడా కూడా లేదన్నారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, అక్బర్ హుస్సేన్, కృష్ణమోహన్ రావు, పొనుగంటి మల్లయ్య, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ ఎండి కరుణాకర్, జిఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్