Monday, February 24, 2025
HomeTrending Newsకొందరి స్వార్థంతో మునుగోడు ఎన్నికలు - మంత్రి తలసాని

కొందరి స్వార్థంతో మునుగోడు ఎన్నికలు – మంత్రి తలసాని

కొందరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలతోనే మునుగోడు ఉప ఎన్నిక వస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. మునుగోడ్ లో రాబోయే ఉపఎన్నికల్లో TRS గెలుపు ఖాయమన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని మున్సిపల్ గ్రౌండ్ వద్ద మునుగోడ్ సభకు వెళ్లే వాహనాల భారీ ర్యాలీని ఈ రోజు మంత్రి తలనసాని ప్రారంభించారు. ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల నుంచి మూడు వందల చొప్పున కార్లలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు మునుగోడుకు బయల్దేరారు. మొత్తంగా ఐదు వేలకుపైగా కార్లతో హైదరాబాద్‌ నుంచి మునుగోడుకు భారీ ర్యాలీ జరుగనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  BJP MLA లు గెలిచిన నియోజకవర్గాలకు కేంద్రం నుండి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పగలరా అని మంత్రి తలసాని ప్రశ్నించారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అగ్రస్థానంలో తెలంగాణ ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తుందని మంత్రి చెప్పారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి పెద్దన్నగా KCR.. ఒక లక్ష 116రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహాంతో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని, తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తెరాస తమ ఇంటి పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారని మంత్రి తలసాని వెల్లడించారు.

Also Read : కొందరి స్వార్థంతో మునుగోడు ఎన్నికలు మంత్రి తలసాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్