Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం

Trslp Meeting Begins In Telangana Bhavan :

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైంది. ఈ సమా‌వే‌శానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. వరి‌ధాన్యం కొను‌గోలు విష‌యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ విధా‌నా‌లపై చర్చిస్తున్నారు. యాసంగి ధాన్యం కేంద్ర ప్రభుత్వం సేక‌రిం‌చేలా ఒత్తి‌డి‌చే‌సేం‌దుకు చేప‌ట్టా‌ల్సిన రాజ‌కీయ కార్యా‌చ‌ర‌ణపై ఎమ్మె‌ల్యే‌లకు సీఎం దిశా‌ని‌ర్దేశం చేసే అవ‌కాశం ఉంది. వాతా‌వ‌రణ పరి‌స్థి‌తులు, నేలల స్వభా‌వాన్ని బట్టి యాసం‌గిలో వరి‌యే‌తర పంటల సాగును ప్రోత్స‌హించే అంశంపై ఎమ్మె‌ల్యే‌లతో సీఎం చర్చిం‌చ‌ను‌న్నారు.

రాష్ట్ర ‌ప్ర‌భుత్వం 4,200 కొను‌గో‌లు ‌కేం‌ద్రాలు ఏర్పా‌టు‌చేసి వాన‌కాలం వడ్లను ఇప్ప‌టికే సేకరించింది. కొను‌గోలు చేసిన ధాన్యా‌నికి ఎలాంటి ఆలస్యం లేకుండా రెండు‌మూడు రోజు‌ల్లోనే రైతు‌లకు డబ్బు లు చెల్లి‌స్తు‌న్నది. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొను‌గోలు చేయ‌బో‌మని తెగేసి చెప్పడం, మరో‌వైపు రాష్ట్ర బీజేపీ నేతలు యాసం‌గిలో వరి‌పంటే వేయా‌లని రైతు‌లను రెచ్చ‌గొ‌డు‌తుం‌డ‌టంపై ఎల్పీ సమా‌వే‌శంలో ప్రధా‌నంగా చర్చించే అవ‌కాశం ఉన్నది. యాసంగి వరి‌ధాన్యం కొను‌గో‌లుపై బీజేపీ నేతల కుట్ర‌లను ఎండ‌గ‌ట్టేం‌దుకు ఎలాంటి రాజ‌కీయ కార్యా‌చ‌రణ రూపొం‌దిం‌చా‌ల‌న్న‌దా‌నిపై కూడా ఈ సమా‌వే‌శంలో చర్చించే అవ‌కాశం ఉన్న‌దని పార్టీ వర్గాలు తెలి‌పాయి.

 

టీఆర్ఎస్ ఎల్పీ భేటీ సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు శాలువా క‌ప్పి పుష్పగుచ్ఛాలు అందించి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Also Read :  కేంద్రం వైఖరికి నిరసనగా ఎల్లుండి ధర్నా

RELATED ARTICLES

Most Popular

న్యూస్