మే 30న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాలమీద క్యాబినెట్ చర్చించనున్నది.
ఈనెల 11న సమావేశమైన కేబినేట్ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విదుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోసారి 20న క్యాబినెట్ సమావేశమై మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. అయితే 18న ముఖ్యమంత్రి మంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడి లాక్ డౌన్ ను 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో 20 న జరగాల్సిన క్యాబినెట్ భేటి రద్దయింది.
౩౦న సమావేశం కానున్న క్యాబినెట్ లాక్ డౌన్ పొడిగిస్తుందా లేక ప్రస్తుతం ఇస్తున్న సడలింపు సమయాన్ని పెంచుతారా అనేది వేచి చూడాలి.