Monday, January 20, 2025
HomeTrending Newsరెండ్రోజుల్లో చెబుతాం: సిఎంకు పియూష్ హామీ

రెండ్రోజుల్లో చెబుతాం: సిఎంకు పియూష్ హామీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో వరుసగా రెండోరోజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్ట పోతారని కేంద్రమంత్రికి వివరించారు.

అయితే నాలుగేళ్ళకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు సమావేశంలో చెప్పారు, ధాన్యం ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేసియార్ కోరారు.  ఉత్తరాదిలోనూ వరిధాన్యం అధికంగా పండించడంతో దిగుబడి ఎక్కువగా వచ్చి సమస్య ఏర్పడిందని, రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించేలా చూడాలని పీయూష్ గోయెల్ సూచించారు. కేంద్ర మంత్రివర్గ ఉప సంఘంతో చర్చించి ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేయగలమో రెండ్రోజుల్లో చెబుతామని గోయెల్ హామీ ఇచ్చారు. సిఎం వెంట టి ఆర్ ఎస్ ఎంపీలు, ప్రభుత్వాధికారులు ఉన్నారు.

గతంలో కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వరి పండించేవారని, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ పంట వేస్తున్నందున సమస్య ఏర్పడిందని సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ వెల్లడించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారని వినోద్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్