Saturday, March 14, 2026
HomeTrending Newsరావత్ మృతిపై కేసిఆర్ విచారం

రావత్ మృతిపై కేసిఆర్ విచారం

ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంఘటనలో జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read : బిపిన్ రావత్ ఇక లేరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular