Saturday, March 14, 2026
HomeTrending Newsత్వరగా పూర్తి చేయండి: కెసియార్

త్వరగా పూర్తి చేయండి: కెసియార్

నూతన సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం అయన పరిశీలించారు. పనుల పురోగతిపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సిఎం అభినందించారు.

కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సిఎం కెసిఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి సహా ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీ ఇంజనీర్లతో పనుల గురించి చర్చించారు. నిర్మాణంలో ఉన్న మంత్రుల ఛాంబర్లు , పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల ఛాంబర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తూ, అధికారులకు తగు సూచనలిచ్చారు. కారిడార్లు సహా గ్రౌండు ఫ్లోరు, మొదటి  ఫ్లోరుతో సహా నిర్మాణంలో వున్న సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగారు. తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర ఫైనల్ వర్కుల కోసం తగు సూచనలు  చేశారు.

నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా  పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పలు రకాలుగా పరిశీలించి తాను సూచించిన మేరకు నిర్మాణం జరుగుతుండడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డిలను అభినందించారు. ప్రస్తుతం నడుస్తున్న పనితీరును అదే విధంగా  ముందుకు కొనసాగించాలన్నారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి,  ఆర్ అండ్ బి శాఖ ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్ అండ్ బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ ఫాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : జూనియర్ అసిస్టెంట్లుగా మహిళా పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular