Saturday, January 18, 2025
Homeతెలంగాణకోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పిన కెసియార్

కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పిన కెసియార్

వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని ముఖ్యమంత్రి కెసియార్ సందర్శించారు. కోవిడ్ వార్డుల్లో తిరిగి రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి పలకరించారు. వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఆస్పత్రి అధికారులు వున్నారు.

ఈ సందర్భంగా వెంకటాచారి అనే రోగి కెసియార్ జిందాబాద్, కెసియార్ నాకు రెండో ప్రాణం అంటూ కేకలు వేశారు. ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మి కాంతారావు నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్