Friday, April 11, 2025
Homeతెలంగాణఈటెల పై మరో విచారణ

ఈటెల పై మరో విచారణ

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై వచ్చిన మరో పిర్యాదుపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కెసియార్ సిఎం సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఈటెల కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ, న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సూచించారు. ఏసిబి విజిలెన్స్, రెవెన్యూ శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్