Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణ‌ విద్యుత్ వినియోగం ఏటా 2,012 యూనిట్లు

తెలంగాణ‌ విద్యుత్ వినియోగం ఏటా 2,012 యూనిట్లు

తెలంగాణ‌లో 2020- 21లో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత విద్యుత్ రంగాన్ని ప‌టిష్టం చేసేందుకు వివిధ ర‌కాల‌ చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం అనేక విజ‌యాలు సాధించింద‌ని స్ప‌ష్టం చేశారు. జాతీయ త‌ల‌స‌రి వినియోగం 1,161 యూనిట్లుగా ఉంది. మ‌న త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు అని పేర్కొన్నారు. జాతీయ త‌ల‌స‌రి వినియోగంతో పోల్చితే మ‌న త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 70 శాతం ఎక్కువ‌గా ఉంద‌న్నారు.
విద్యుత్ రంగాన్ని సీఎం కేసీఆర్ చ‌క్క‌దిద్దారు. మొద‌టి ఆరు నెల‌ల్లోనే అద్భుత‌మైన విజ‌యం సాధించామ‌న్నారు. అన్ని రంగాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. 2014లో 7,778 మెగ‌వాట్లు ఉంటే ఇవాళ 17,503 మెగావాట్ల‌కు చేరుకుంద‌న్నారు. సోలార్ విద్యుత్ రంగంలో 74 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి ఉంటే.. ఇవాళ 4,430 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకుంటున్నాం. తెలంగాణ ఏర్ప‌డే నాటికి 5,661 మెగ‌వాట్ల పీక్ డిమాండ్ ఉంటే.. ఇప్పుడు 13,688 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంద‌న్నారు. ఈ ఎనిమిదేండ్ల‌లో కొత్త‌గా 17 స‌బ్ స్టేష‌న్లు(400 కేవీ) ఏర్పాటు చేశామ‌న్నారు. 220 కేవీ స‌బ్ స్టేష‌న్లు కొత్త‌గా 46, 132 కేవీ స‌బ్ స్టేష‌న్లు 68 ఏర్పాటు చేశామ‌న్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్