Saturday, November 23, 2024
HomeTrending Newsఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు పరీక్షల నిర్వహించాలంటే లక్షలాది మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇందులో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. మరికొన్నాళ్ళ పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉన్నందున ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే ఈ పరీక్షలను నిర్వహించడం కంటే రద్దు చేయడమే మంచిదని ప్రభుత్వం భావించింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సి.బి.ఎస్.ఈ. 10, 12 తరగతుల పరీక్షలను ఇప్పటికే రద్దు చేసింది. దీంతో నిన్న సమావేశమైన తెలంగాణా క్యాబినెట్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొని, దీనికి సంబంధించి విద్యార్ధులకు కేటాయించబోయే మార్కులు, గ్రేడ్లు తదితర అంశాలతో సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయాలని విద్యాశాఖకు సూచించింది.

5,21,000 మంది పదో తరగతి విద్యార్ధులు, 04,59,008 మంది ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేస్తూ ఏప్రిల్ 15న తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ తీసుకున్న నిర్ణయంతో 4,73,967 మంది సెకండియర్ రెగ్యులర్ విద్యార్ధులతో పాటు, ఫస్టియర్ లో కొన్ని సబ్జెక్టులు తప్పినవారు 1,99,019 మంది కూడా పాస్ అయినట్లు ప్రకటిస్తారు. వీరికి ఇవ్వనున్న మార్కులు, గ్రేడ్లు వారం రోజుల్లో వెల్లడిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్