ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో తెలంగాణ ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ కోరింది.
గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చేపడుతోందని ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలని గతంలో ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని గుర్తు చేస్తూ… అధికారుల పర్యటనను అనేక సార్లు ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని లేఖలో ఆరోపించింది.
కేఆర్‌ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాలని కోరిన తెలంగాణా ప్రభుత్వం…..బృందం పర్యటనకు వస్తే తమ ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎన్జీటీ బృందానికి హెలికాప్టర్, వాహనాలు, వసతులు అన్ని తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని భరోసా ఇచ్చింది.