Thursday, January 23, 2025
Homeతెలంగాణజూనియర్ డాక్టర్ల స్టైఫండ్ 15 శాతం పెంపు

జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ 15 శాతం పెంపు

రాష్ట్రంలో జునియర్ డాక్టర్ల స్టైఫండ్ ను 15 శాతం పెంచుతున్నట్లు మంత్రి కేటియార్ వెల్లడించారు. సాయంత్రానికి దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేస్తామని ట్వీట్ ద్వారా తెలియజేశారు. జునియర్ డాక్టర్ల డిమాండ్ ను సిఎం దృష్టికి తీసుకెళ్ళామని స్టైఫండ్ పెంచాల్సిందిగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారని కేటియార్ పేర్కొన్నారు.

నాలుగు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు(జూడా) ఆరోగ్య కార్యదర్శికి సమ్మె నోటిసు ఇచ్చారు. 15 శాతం స్టైఫండ్ పెంపుతో పాటు, కరోనా కోసం పనిచేస్తున్న వైద్యులకు 10 శాతం ఇన్సెంటివ్, జుడాల బంధువులకు కరోనా సోకితే వారికి నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వాలని, కరోనా విధుల్లో మరణించిన వైద్య సిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని.. ఈ నాలుగు డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. లేని పక్షంలో మే 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని జుడాల అధ్యక్షుడు వి. నవీన్ రెడ్డి ప్రకటించారు.

ఈ నాలుగు డిమాండ్లలో ఒక దాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. కేటియార్ ట్వీట్ చేసిన కాసేపట్లోనే జిఓ కుడా విడుదలైంది. మరో మూడు డిమాండ్ల విషయంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకూవాలని జుడాలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్