Thursday, November 21, 2024
Homeతెలంగాణబ్లాక్ ఫంగస్ పై సర్కారు అప్రమత్తం

బ్లాక్ ఫంగస్ పై సర్కారు అప్రమత్తం

బ్లాక్ ఫంగస్ వైరస్ పై తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది.  దీన్ని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించి…  రాష్ట్రంలో ఎక్కడ బ్లాక్ ఫంగస్ కేస్ లు నమోదైనా వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రులన్నింటికి ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

ప్రతి రోజు ఆయా ఆస్పత్రుల్లో నమోదైన, బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివారాలు ఆరోగ్య శాఖ కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

కరోనా చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోవడం,  డయాబెటిక్ వాళ్ళ బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలున్నాయని  వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం ఈ వ్యాధిని పాండమిక్ గా ప్రకటించింది. రాజస్థాన్ తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బాంక్ ఫంగస్ కేసులు గుర్తించారు.  దీంతో తెలంగాణా ప్రభుత్వం కూడా ఈ వ్యాధిపై దృష్టి సారించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్