Saturday, January 18, 2025
Homeతెలంగాణవ్యవసాయం, వైద్యం, మీడియాకు మినహాయింపు

వ్యవసాయం, వైద్యం, మీడియాకు మినహాయింపు

రాష్ట్రంలో అమలు కానున్న లాక్ డౌన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణాకు మినహాయింపు ఇచ్చింది. ఎఫ్.సి.ఐ.కి ధాన్యం సరఫరా, ఎరువులు, విత్తనాల షాపులు, విత్తన తయారీ కర్మాగారాలకు లాక్ డౌన్ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు ఇచ్చారు. ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయని, ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.

తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమె మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్