Saturday, January 18, 2025
Homeతెలంగాణబ్లూ ప్రింట్ ఇవ్వండి : హైకోర్టు

బ్లూ ప్రింట్ ఇవ్వండి : హైకోర్టు

కోవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళిక ఉందో బ్లూ ప్రింట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయిస్తూ కొత్త జివో విడుదల చేయాలని సూచిందింది.  రాష్ట్ర హైకోర్టులో నేడు రెండోరోజు కోవిడ్ పై విచారణ జరిగింది.

కోవిడ్, లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న బి.పి.ఎల్. కుటుంబాలకు నిత్యావసరాలు అందించాలని చెప్పిన న్యాయస్థానం దీనిపై వచ్చే విచారణ సమయానికి తగిన నివేదిక ఇవ్వాలని కోరింది. కోవిడ్ తో మరణించిన టీచర్లను  వారియర్లుగా గుర్తించి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్