ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల వ్యవహారంపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. టెండర్లపై తెలంగాణ పిసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను ఈ రోజు హైకోర్టు విచారించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని…. ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో ఏం మాట్లాడుతారని ప్రశ్నించింది. సమాచార హక్కు చట్టం ఉన్నది ఎందుకని అడ్వొకేట్ జనరల్ ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిలదీసింది.
ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని అడ్వొకేట్ జనరల్ తెలిపాడు. 2 వారాల్లోగా మల్కాజ్ గిరి ఎంపి రేవంత్‌రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది హైకోర్టు.