Friday, November 22, 2024
HomeTrending Newsకేసియార్ తో చర్చలకు సిద్ధం : పేర్ని నాని

కేసియార్ తో చర్చలకు సిద్ధం : పేర్ని నాని

కృష్ణా నీటి వివాదంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ తో చర్చించేందుకు ఏపి సిఎం జగన్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉద్వేగాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నేతలు చేస్తున్న వాదన రాజకీయ అవసరమని పేర్ని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన నీటినే వాడుకుంటున్నాము తప్ప ఒక్క గ్లాసు నీరు కూడా అదనంగా వాడుకోవడం లేదని, ఈ విషయాన్ని ఇదివరకే సిఎం జగన్, నీటి పారుదల మంత్రి అనిల్ స్పష్టంగా చెప్పారని మంత్రి నాని తెలిపారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేస్తామన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను పేర్ని ఖండించారు. తెలుగు రాష్ట్రాలకు నీటి పంపకాల విషయంలో దివంగత నేత వైఎస్ చేసిన కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. అలాంటి వైఎస్ పై చెడుగా, తప్పుగా మాట్లాడడం పూర్తిగా ఓట్ల కోసమో, రాజకీయాల కోసమో మాత్రమేనని స్పష్టం చేశారు. వైఎస్స్ గురించి చెడు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఒక్కడే మాట్లాడతారని, తెలంగాణాలో రాజకీయం కోసమే వైఎస్ ను విమర్శిస్తారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేది తమ విధానమని, సిద్ధాంతపరంగా బిజెపితో మాకు వైరుధ్యం ఉన్నా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబటి సమరస్యంగానే ఉంటామని వివరించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ప్రతి విషయంలో కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్