Sunday, March 8, 2026
HomeTrending Newsబాబు కంట్రోల్ కి టి-పిసిసి: విజయసాయి

బాబు కంట్రోల్ కి టి-పిసిసి: విజయసాయి

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకంపై వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎట్టకేలకు తన శిష్యుడికి ఆ పదవి కట్టబెట్టేలా చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారని, ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేశారని ఆరోపించారు. తెలంగాణాలో కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొట్టు పెటుకొని ఆ పార్టీని భ్రష్టు పట్టించారని, ఇప్పుడు ఏకంగా ఆ పార్టీనే తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారని ట్వీట్ చేశారు.

‘మనవాళ్ళు బ్రీఫ్డ్’ కేసు ఎప్పటికీ తేలకుండా తన పార్టీ తెలంగాణా అధ్యక్షుడిని గులాబీ పార్టీలోకి జొప్పిస్తున్నారని కూడా ఆ ట్వీట్ లో విజయసాయి కామెంట్ చేశారు. కేసుల నుంచి తనకు రక్షణ కల్పించేందుకు నలుగురు రాజ్యసభ ఎంపీలను బిజెపి తీర్థం ఇప్పించారని అయన గుర్తు చేశారు. దీనికంటే ముందుగానే పచ్చ రక్తం నరనరానా ప్రవహించే కొందరిని ముందుగానే కాంగ్రెస్ లోకి తోలారని అయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. మొత్తంమీద రేవంత్ రెడ్డికి పిసిసి పీఠం దక్కడంపై విజయసాయి చేసిన ఈ ట్వీట్ సంచలనం కలిగిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular