తెలంగాణాలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. కొంతమంది పని లేకపోయినా, డూప్లికేట్ ఐ డి కార్డులు పెట్టుకుని రోడ్ల పైకి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని నివారించేందుకు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆపి పరిశీలించి తగిన కారణం ఉన్నవారినే అనుమతిస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో కూడా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. చెక్ పోస్టులు పెంచి ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతున్నారు. కేసులు నమూదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు.
లాక్ డౌన్ అమలుపై సిఎం కేసియార్ ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా వుండాలని డిజిపి మహేందర్ రెడ్డి నిన్న పోలిస్ అధికారులను ఆదేశించారు. డిజిపి సూచనలతో హైదరాబాద్, సైబెరాబాద్, రాచకొండ కమిషనర్లు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.