Thursday, March 27, 2025
HomeTrending NewsTSPSC:టీఎస్‌పీఎస్సీ కేసు ఏప్రిల్ 11కి వాయిదా

TSPSC:టీఎస్‌పీఎస్సీ కేసు ఏప్రిల్ 11కి వాయిదా

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కేసును సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని NSUI అధ్యక్షుడు బలమూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదన్న పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారంది హైకోర్టు. విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తుండగా… స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. అందుకు మూడు వారాల గడువిచ్చింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్