Monday, January 27, 2025
HomeTrending NewsTSPSC: పాలనపై పట్టు కోల్పోయిన కేసీఆర్ : అఖిలపక్షం

TSPSC: పాలనపై పట్టు కోల్పోయిన కేసీఆర్ : అఖిలపక్షం

జాతీయ రాజకీయాల మీద దృష్టి కేంద్రీకరించి, సొంత రాష్ట్రంలో పరిపాలన మీద సీఏం కేసీఆర్ పట్టు కోల్పోయారని‌, అందుకే రాష్ట్రంలో పేపర్ల లీకేజీ అనేది ఒక ట్రెండ్ గా మారిపోయిందని అఖిలపక్ష పార్టీల‌ నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం టీజేఏస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రతరం అవుతున్న నిరుద్యోగ సమస్య మీద, TSPSC పేపర్ల లీకేజీ, పదవతరగతి పేపర్ల లీకేజీల మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి సమగ్రంగా చర్చ జరిగింది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు అందరూ ఒకే వేదిక మీదికి వచ్చి ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. దీని‌ కోసం “TSPSC పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ” అనే వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా త్వరలోనే నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేయాలని సమావేశంలో నిర్ణయం జరిగింది.

దీనికి సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ సిధ్ధం చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే విలేకరుల సమావేశంలో కమిటీ తరపున అఖిలపక్ష నాయకులు పూర్తి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, టీజేఏస్ పార్టీ అధ్యక్షులు ప్రొ. కోదండరాం, తెలంగాణ BSP పార్టీ అధ్యక్షులు RS. ప్రవీణ్ కుమార్, తెలంగాణ బచావో ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి, CPIML ప్రజాపంథా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు రమాదేవి, CPIML న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు జేవీ. చలపతి రావు , రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కన్నెగంటి రవి, తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ సుధాకర్ , POW రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, టీజేఏస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్ప, BSP పార్టీ అధికార ప్రతినిధి అరుణ క్వీన్, విద్యార్థి యువజన నాయకులు YJS సలీమ్ పాష, TVS కోట శ్రీనివాస్, PDSU మహేష్, PDSU రామకృష్ణ, PYL ప్రదీప్, VJS అరుణ్ కుమార్, SSU నవీన్ కుమార్, BSF సంజయ్, YJS వీరన్న, LSO శరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : paper leak: ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు – రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్