Saturday, January 18, 2025
HomeTrending Newsటిటిడి బోర్డు కీలక నిర్ణయం: రమణ దీక్షితులు తొలగింపు

టిటిడి బోర్డు కీలక నిర్ణయం: రమణ దీక్షితులు తొలగింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో  గౌరవ ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులును ఆ బాధ్యతల నుంచి తొలగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి అధికారులు, బోర్డు, ఆలయ కైంకర్యాలపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న టిటిడి బోర్డు ఆయనపై చర్యలకు మొగ్గు చూపింది. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై కేసు కూడా నమోదు చేసింది. తిరుమల అన్నమయ్య భవన్ లో బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • నడక దారిలోని గాలిగోపురం, ఆంజన్న విగ్రం, మోకాలిమెట్టు దగ్గర నిత్య సంకీర్తనార్చన
  • తాళ్ళపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన
  • బంగారు వాకిలి వద్ద 1.69 కోట్లతో జయ విజయుల విగ్రహాలకు బంగారు తాపడం
  • రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల చొప్పున తాలిబొట్లు  తయారీకి ఆమోదం
  • ధార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం
  • ఫిబ్రవరి 24 ప్రతి ఏడాది  తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహించాలని నిర్ణయం
  • వడమాలపేటలోని టిటిడి ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు రూ. 8.16 కోట్లు
  • రూ. 3.89 కోట్లతో  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో లైటింగ్ ఏర్పాటు
  • రూ. 3.11 కోట్ల నిధులతో సప్తగిరి వసతి గదులు 1,4 బ్లాకుల ఆధునికీకరణ
  • శ్రీలంకలోని కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణం
  • టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులు 15 వేల మందికి రూ. 3 వేల నుంచి 20వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం
  • టీటీడీ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు తిరుమల ఎంప్లాఈస్ క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం అందించడానికి భూమన కరుణాకర రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరలతో వీరికి కూడా టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తారు. ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్