శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం-పర్జన్యశాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు నేడు జరిగిన మహా పూర్ణాహుతితో ముగిశాయి. వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ఎంతో నిష్టగా, అంకితభావంతో యాగాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి , శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు బాలిరెడ్డి , గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.