Thursday, March 19, 2026
HomeTrending NewsTTD: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ కు బోర్డు నిర్ణయం

TTD: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ కు బోర్డు నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు బోర్డు శుభవార్త అందించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగులరైజ్ చేస్తామని తెలిపారు. భూమన అధ్యక్షతన మంగళవారం అన్నమయ్య భవన్‌లో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను భూమన మీడియాకు వివరించారు.

* అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం
* టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థల కేటాయించే ప్రాంతాలలో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం. 15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం
* టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు ఇస్తాం, మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నాం
* తిరుపతి రాం నగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు
* టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850
* తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగుల సర్వీసు మరో ఏడాది పొడిగింపు, 3.40 లక్షలు కేటాయింపు
* మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయింపు
* రేణిగుంట రోడ్డు నుంచి తిరుచానూరు వరకు 3.11 లక్షలతో అభివృద్ధి
* 4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం అలయం వరకు రూ. 21 కోట్లు
* తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టిబీవార్డు నిర్మాణానికి ఆమోదం
* స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనానికి 3.35 లక్షలతో కేటాయింపు
* స్వీమ్స్ వైద్య సదుపాయాలు పెంపునకు కార్డియోకు నూతన భవనం
* స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు 197 కోట్లు కేటాయింపు
* తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో 3.50 లక్షలతో నూతన కెమారాలు, బోన్లు కొనుగోలుకు నిర్ణయం
* కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం
* సాంప్రదాయ కళల అభివృద్ధికి టీటీడీ ప్రాథమిక శిక్షణ.. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వనున్న టీటీడీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular