Wednesday, March 18, 2026
HomeTrending Newsసిఎంకు టిటిడి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

సిఎంకు టిటిడి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఆహ్వానించింది. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో టిటిడి ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి ఏ వీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కలుకుని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 1న ఐదవ రోజున గరుడసేవ సందర్భంగా సిఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Also Read: సిఎం జగన్ కుప్పం టూర్ ఒకరోజు వాయిదా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular