Thursday, March 19, 2026
HomeTrending Newsసిఎం జగన్ కు టిటిడి ఆహ్వానం

సిఎం జగన్ కు టిటిడి ఆహ్వానం

TTD: విశాఖపట్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టిటిడి ఆహ్వానించింది.

నేడు ఉదయం శాసనసభలోని  ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు కలుసుకుని ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ సందర్భంగా వేద పండితులు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular