తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు శుభవార్త చెప్పింది. ఇకనుంచి రోజూ 10 వేల టికెట్లు నడకదారి భక్తులకు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా చేరుకుంటారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తులకు ప్రతి రోజూ 3 వేల టికెట్లను జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచడం విశేషం. శ్రీవారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే నడకదారి భక్తులకు 6 వేలు టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం నడకదారి భక్తులకు టికెట్ల జారీ పెంపుతో భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నడకదారి భక్తులకు టికెట్లు జారీ చేయాలనే డిమాండ్ కొన్నిరోజులుగా వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి రావడం, టీటీడీలో అధికార మార్పిడి జరగడంతో కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఈ నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటున్నాయి.