Monday, November 25, 2024
HomeTrending Newsజీవితాంతం దేశ ప్రజలకు సేవ చేస్తా - రాహుల్ గాంధి

జీవితాంతం దేశ ప్రజలకు సేవ చేస్తా – రాహుల్ గాంధి

నాటి తుక్కుగూడ సభతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం తుక్కుగూడ నుంచే పూరించింది. అశేష జనవాహిని తరలివచ్చిన జనజాతర బహిరంగ సభలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. న్యాయ పత్రం పేరిట రాహుల్ గాంధి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

రాహుల్ గాంధీ ప్రసంగంలో ముఖ్యాంశాలు

అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు ఈ వేదికపై వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం జాతీయ స్థాయిలోనూ గ్యారంటీలను అమలు చేస్తాం.

ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రమే కాదు.. భారత దేశ ఆత్మ. ఈ మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల జీవితాల్లో వెలుగులు తీసుకోస్తాం. యువ న్యాయం పథకం ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.

దేశంలో విద్యావంతులైన యువతకు నెలకు రూ.8500 ఉపకారవేతనంతో ఏడాదిపాటు అప్రంటీస్ షిప్ శిక్షణ అందిస్తాం. మహిళా న్యాయం పథకం ద్వారా ప్రతీ పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తాం. దేశంలో ప్రతీ రోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతు న్యాయం పథకం ద్వారా రైతు రుణాల మాఫీ చేస్తాం. స్వామినాథన్ కమిటర్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. కార్మిక న్యాయం ద్వారా కార్మికులకు సామాజిక, ఉద్యోగ భద్రత కల్పిస్తాం.

దేశంలో 50శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. 15శాతం దళితులు,8 శాతం గిటిజనులు, ఆదివాసీలు ఉన్నారు. 15శాతం మైనారిటీలు ఉన్నారు. శాతం ఇతర పేద వర్గాలు ఉన్నాయి. మోడీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సమన్యాయం జరగడం లేదు.

అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతాం. కులగణన దేశానికి ఎక్స్ రే లాంటిది. సామాజిక , ఆర్థిక అంశాలతో కూడిన కుల గణన చేపడతాం. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ 50 శాతం మించకూడదనే పరిమితిని తొలగిస్తాం.

తెలంగాణలో గత ప్రభుత్వం వేల మంది ఫోన్స్ ను ట్యాప్ చేసింది. మాజీ సీఎం… ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారో మీరు చూశారు. ఫోన్ ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేశారు. ఇక్కడ కేసీఆర్ లాగే కేంద్రంలో ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఈడీని బలవంతపు వసూళ్ల సంస్థగా మార్చేశారు

ఎలక్ట్రోరల్ బాండ్స్ రద్దు ఒక పెద్ద కుంభకోణం. సీబీఐ పేరుతో భయపెట్టి కంపెనీల నుంచి పార్టీ ఫండ్ తీసుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నాం. రాజ్యాంగం ప్రజలకు రక్షణ.. కానీ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది. మేం రాజ్యాంగాన్ని రద్దు చేయనీయబోము. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతాం.

బీజేపీ వైపు కార్పొరేట్ కంపెనీలు, ధనం ఉంది. ఇవేవీ లేకపోయినా కాంగ్రెస్ కు ప్రజల ప్రేమ ఉంది. మీతో నాకున్నది రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం. నా జీవితాతం మీకు సేవ చేస్తూనే ఉంటా. నా జీవితాంతం తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా. ఏదో ఒక రోజు మేడ్ ఇన్ తెలంగాణ అనేది మేడ్ ఇన్ చైనా కంటే బలంగా వినిపిస్తుంది.

కాంగ్రెస్ కు ఓటు వేసి రాహుల్ గాంధిని ప్రధానమంత్రి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. బిజెపిని బొంద పెట్టేదాకా విశ్రమించేది లేదని సిఎం తేల్చి చెప్పారు.  తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపి అభ్యర్థులు ఇతర నేతలు పాల్గొన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్