Big Cinemas: ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ కూడా ‘బీస్ట్‘ సినిమాను గురించి .. ‘కేజీఎఫ్ 2’ గురించి మాట్లాడు కుంటున్నారు. ఈ రెండు సినిమాలు భారీస్థాయిలో .. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి . ‘బీస్ట్’ ఈ నెల 13వ తేదీన విడుదలవుతుంటే, ‘కే జీఎఫ్ 2’ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. రెండు భారీ సినిమాలు ఒక రోజు తేడాతో విడుదలవుతుండటంతో, అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. పోటీ నుంచి విజయ్ సినిమా తప్పుకుంటుందని అనుకుంటే, అలా జరగకపోవడం మరింత ఉత్కంఠను పెంచుతోంది.
అయితే నిజానికి ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ ఉండదు . ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఎలాంటి పోలిక లేదు కనుక. రెండు సినిమాల్లో యాక్షన్ ఉన్నప్పటికీ, వాటితో ముడిపడిన నేపథ్యాలు వేరు. విజయ్ 60కి పైగా సినిమాలు చేశాడు. తమిళనాట ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతాకాదు. ఈ సినిమాలో విజయ్ సోల్జర్ లా కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే కనిపించనుంది. మాటల నుంచి పాటల వరకూ అన్నింటిలోను మసాలా దట్టించి ఉంటుంది. ప్రతి అంశాలోను విజయ్ మార్కు కనిపిస్తూనే ఉంటుంది. విజయ్ ఈ సినిమాలో ఏ మేజిక్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అనిరుధ్ పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక ‘కేజీఎఫ్ 2‘ విషయానికి వస్తే .. యశ్ కి ఉన్న క్రేజ్ .. ఈ సినిమా ఫస్టు పార్టు వలన వచ్చిందే. యశ్ ఎలా కనిపించనున్నాడు? ఎలా చేయనున్నాడు? అనే దానికంటే కూడా, ఆయనను ప్రశాంత్ నీల్ ఎలా చూపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఇది డైరెక్టర్ సినిమా. అందువలన ఆ వైపు నుంచి రేకెత్తించే ఆసక్తి ఎక్కువ. ఇది పూర్తిగా బంగారు గనుల నేపథ్యంలో సాగే కథ. కథ సీరియస్ గా సాగుతుంది. కామెడీకి .. రొమాన్స్ కి పెద్దగా ఆస్కారం లేని సినిమా. హీరోల పరంగా .. కథల పరంగా పోలికపెట్టడానికి అవకాశమే లేదు. దేని రికార్డులు దానిని .. దేని కప్పులు దానివి. అందువలన ఈ రెండు సినిమాలకు ముడిపెట్టేసే ప్రయత్నాలు మానుకుంటే, ఎంజాయ్ చేయవచ్చు.
Also Read : బుట్టబొమ్మకు మరీ అంతా?