Thursday, March 12, 2026
Homeసినిమావిజయ్ దేవరకొండ సరసన ఇద్దరు బ్యూటీలు!

విజయ్ దేవరకొండ సరసన ఇద్దరు బ్యూటీలు!

విజయ్ దేవరకొండ నుంచి రీసెంటుగా వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. కథాకథనాల పరంగా యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, హిట్ టాక్ కి దూరంగానే నిలిచిపోయింది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. ఆ అంచనాలు కూడా ఈ సినిమా యావరేజ్ టాక్ కి ఒక కారణమై కూర్చుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ఉంది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ బోర్సే  పేరు తెరపైకి వచ్చింది. నైజీరియాలోని లాగోస్ లో తన చదువును పూర్తి చేసిన ఈ బ్యూటీ, ఆ తరువాత మోడలింగ్ పై దృష్టి పెట్టింది. వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేసింది. అలా తెలుగు ఇండస్ట్రీ దృష్టిలో పడిన ఈ సుందరి, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో పరిచయం కానుంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆమె పేరు వినిపిస్తుండటం విశేషం.

విజయ్ దేవరకొండ సరసన ఆమెకి ఛాన్స్ దొరకడం దాదాపు ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో మమిత బైజును తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర హీరోయిన్ కేటగిరిలో ఉంటుందా? లేదంటే ప్రత్యేక  ఆకర్షణగా మెరుస్తుందా? అనే విషయంలో క్లారిటీ లేదు. మమిత బైజుకి ప్రస్తుతంఉన్న క్రేజ్ ను బట్టి, ఆమె ఎంపిక ప్రాజెక్టుపై అంచనాలు పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, నాగవంశీ – సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular