Saturday, January 18, 2025
HomeసినిమాAllu Arjun: ఆ ఇద్దరిలో బన్నీ మూవీ ఎవరితో..?

Allu Arjun: ఆ ఇద్దరిలో బన్నీ మూవీ ఎవరితో..?

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2.. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువుగా ఉండడం వలన ఇక నుంచి ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అనుకుంటున్నారట. అందుకనే పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉండగానే వరుసగా నెక్ట్స్ ప్రాజెక్టులు ఫైనల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ, సందీప్ రెడ్డితో మూవీ కన్ ఫర్మ్ చేశారు. ఈ రెండు సినిమాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మరో సినిమా ఓకే చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే.. బన్నీతో సినిమా చేయడం కోసం ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.. అది కూడా కోలీవుడ్ డైరెక్టర్స్ పోటీపడుతుండడం విశేషం.

ఇంతకీ ఎవరంటారా..? ఒకరు జవాన్ తో బ్లాక్ బస్టర్ సాధించిన అట్లీ కాగా, మరొకరు జైలర్ తో బ్లాక్ బస్టర్ సాధించిన నెల్సన్ దిలీప్ కుమార్. ఈ ఇద్దరూ బన్నీ కోసం కథ రెడీ చేయడం.. నెరేట్ చేయడం జరిగిందట. ఈ ఇద్దరిలో ఒకరితో బన్నీ సినిమా చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో  ఆ.. ఒక్కరు ఎవరు అనేది టాలీవుడ్, కోలీవుడ్ లో ఆసక్తిగా మారింది. అట్లీ, బన్నీ మధ్య కథాచర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే.. కథ విన్నారు కానీ.. బన్నీ తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదు. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ కథ విన్నారట.

కథ నచ్చిందట కానీ.. అయితే.. తను సినిమా చేయడానికి టైమ్ పడుతుంది కాబట్టి ఈలోపు మరో సినిమా చేసుకోమన్నారట. అలాగే అట్లీతో సినిమా చేయడానికి ఓకే చెప్పినా ఇప్పటికిప్పుడు సినిమా చేయడం కుదరదు. ఈలోపు అట్లీ కూడా మరో సినిమా చేసుకోవాల్సిందే. అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ ఇద్దరిలో ఎవరితో సినిమా చేస్తే  ఎక్కువ క్రేజ్ వస్తుందో ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి అట్లీ, నెల్సన్ లతో సినిమాలు గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి.. బన్నీ ఈ ఇద్దరితో సినిమాలు చేయడం గురించి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్