Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఫిక్స్?

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఫిక్స్?

Title: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఇటీవలే ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తోఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఆర్ఆర్అర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తారక్.. ఒకేసారి తన 30, 31వ చిత్రాల అప్‌డేట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

ఎన్టీఆర్ 30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న‌ ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే.. తాజాగా ఎన్టీఆర్ 31 నుంచి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. ఈ సినిమాకి మేకర్స్ అసుర లేదా అసురుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని అనుకుంటు న్నార‌ట‌. అసుర టైటిల్‌లోనే ఒక పవర్ ఉంది, అలాంటిది ఎన్టీఆర్ సినిమాకి ఆ పేరు పెట్టాలనుకుంటున్నారంటే సినిమా ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉంటుందో..అని టాక్ వినిపిస్తోంది.

కేజీఎఫ్ 2 సినిమాతో ప్ర‌శాంత్ నీల్ చ‌రిత్ర సృష్టించ‌డంతో ఎన్టీఆర్ తో చేయ‌నున్న ఈ సినిమా పై అంచ‌నాటు ఓ రేంజ్ లో ఉన్నాయి. మ‌రో విష‌యం ఏంటంటే… ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ అభిమాని. దీంతో త‌న అభిమాన హీరోను చాలా ప‌వ‌ర్ ఫుల్ గా చూపించాల‌ని ఈ క‌థ‌ను రెడీ చేశాడ‌ట‌. మ‌రి.. ఎన్టీఆర్ తో క‌లిసి ప్ర‌శాంత్ నీల్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read :  ఎన్టీఆర్ మూవీ కోసం నీల్ ఐడియా అదిరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్