Sunday, January 19, 2025
Homeసినిమావేసవిలో ‘ఉగ్రం’తో వస్తున్న అలరి నరేష్

వేసవిలో ‘ఉగ్రం’తో వస్తున్న అలరి నరేష్

అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన  ‘నాంది’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. వీరిద్దరూ ‘ఉగ్రం’ సినిమాకు మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు.  ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. నరేష్ సీరియస్ కాప్ రోల్‌లో కనిపించడం క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ సింగిల్ దేవేరి అభిమానులను అలరించింది.

సినిమా విడుదల తేదీని నేడు అనౌన్స్ చేశారు.  మే 5న  ఉగ్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. సిద్ సినిమాటోగ్రఫీని అందించగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. మరి.. నాంది వలే.. ఉగ్రం కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.

Also Read : ‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్ 19న విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్