Thursday, April 3, 2025
HomeTrending Newsఅక్టోబర్ 2 న యూకే లో బతుకమ్మ వేడుకలు

అక్టోబర్ 2 న యూకే లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి- యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న ‌బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అక్టోబర్ 2 న యూకే లోని ఇల్ ఫోర్డ్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. కాగా, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరలు అందించాలని నిర్ణయించిన తెలంగాణ జాగృతి – యూకే విభాగాన్నిఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి యుకే అధ్యక్షుడు బల్మూరి సుమన్ రావ్, సాయి కృష్ణారెడ్డి, పత్తి రెడ్డి, ప్రశాంత్ పూస, శ్రావణి బాల్మూరి, మానసా రెడ్డి, సాగరికా పూస, రోహిత్ రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్