Friday, March 20, 2026
HomeTrending News1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై రూ.1,082.56 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నారు. దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన ఇది.

ఈ బ్రిడ్జి  నిర్మాణం  30 నెలల్లో  పూర్తి  చేస్తామని గడ్కరీ తెలియజేశారు. ఐకానిక్‌ వంతెన నమూనా ఫోటోలు కూడా ఆయన ట్వీట్ తో జత శేశారు.  ప్రపంచంలో 2వ, దేశంలో తొలి చరిత్రాత్మక వంతెనగా నిలవనుందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular