Sunday, January 19, 2025
HomeTrending Newsఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ

తెలంగాణా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణపై నరేంద్రమోడీ ప్రభుత్వం  ఓ ముందడుగు వేసింది. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. కేంద్ర హోం, న్యాయం, గిరిజన సంక్షేమం, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.  ఈ కమిటీ తొలి సమావేశం 22న జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవలి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 11 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాదిగల విశ్వరూప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలన్న మాదిగల ఆకాంక్షను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ కమిటీ నియమించి సత్వరం దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నేడు కమిటీని ఏర్పాటు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్