Padma Awards: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కు పద్మశ్రీ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం నేడు పద్మ అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. వీటిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముగ్గురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. వీరిలో గరికపాటి తో పాటు, వైద్య శాస్త్రం నుంచి డా. సుంకర వెంకట ఆదినారాయణ; గొసవీడు షేక్ హాసన్ (కళలు)కు పద్మశ్రీ లభించింది.
గరికపాటి 1958లో సెప్టెంబర్ 14న పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం మండలంలోని బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్య నారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు జన్మించారు. 1972 నుంచి గరికపాటి అవధాన ప్రక్రియ చేపట్టారు. సహస్రావధానం చేసి పేరు గడించారు. గరికపాటి 2016లో లోక్ నాయక ఫౌండేషన్ అవార్డు, గురజాడ సాంస్కృతిక సమాఖ్య అవార్డులు; 2018లో రామినేని ఫౌండేషన్ అవార్డులు అందుకున్నారు
Also Read : బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్