Friday, March 20, 2026
Homeతెలంగాణకిషన్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

కిషన్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, అవసరమైన అన్ని జాగ్రత్తలు, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నానని తెలిపారు.  ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో, ఐసోలేషన్ అయ్యానని వివరించారు.

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు, తనతో కాంటాక్ట్ అయినవారు తప్పనిసరిగా కవిడ్ పరీక్షలు తీసుకొని, తగిన జాగ్రత్తలు పాటించాలని కిషన్ రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular