Saturday, January 18, 2025
Homeసినిమాచిరంజీవిని కలుసుకున్న కేంద్ర మంత్రి బండి

చిరంజీవిని కలుసుకున్న కేంద్ర మంత్రి బండి

కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు సినీ హీరో, పద్మ విభూషణ్ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రేపట్నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ బయల్దేరిన సంజయ్ విమానాశ్రయానికి వెళ్ళే ముందు చిరు నివాసానికి వెళ్ళారు. కేంద్ర మంత్రిని  చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఇరువురూ ఒకరినొకరు సన్మానించుకున్నారు.

తన శ్రేయోభిలాషి, మంచి వ్యక్తి అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని  ఎప్పుడు కలుసుకున్నా ఎంతో సంతోషం కలుగుతుందని,  తన విద్యార్ధి దశనుంచి వారి సినిమాలకు తాను పెద్ద అభిమానినని బండి సంజయ్ సామాజిక మాధ్యమాల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్