Friday, March 13, 2026
Homeసినిమా'#RKFI52'లో కమల్ హాసన్...

‘#RKFI52’లో కమల్ హాసన్…

హెచ్.వినోద్ దర్శకత్వంలో RKFI ప్రొడక్షన్ నంబర్ 52ని ప్రజంట్ చేస్తోంది. ప్రముఖ తారాగణం, సిబ్బందితో కూడిన ఈ చిత్రం వారి గత బ్లాక్‌బస్టర్ విక్రమ్ తర్వాత RKFI నుండి మరపురాని చిత్రాల్లో ఒకటిగా ఉంటుందని భరోసా ఇస్తుంది.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలో ఎన్నో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రతిభని స్వీకరించడం, ఉన్నత వినోద విలువలతో నాణ్యమైన చిత్రాలను రూపొందించడానికి సహకరించడం అత్యవసరం. నేను నా అనుభవాన్ని పంచుకోవడానికి, అలాగే కొత్త విషయాలను తెలుసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ ప్రతిభావంతులతో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. వినోద్ సృజనాత్మకత, కంటెంట్ పట్ల నిబద్ధత కలిగి వున్న దర్శకుడు. కమర్షియల్‌గా సక్సెస్‌ తో పాటు సామాజిక ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీశారనే పేరు తెచ్చుకున్నారు. RKFI 52 కూడా ఇలాంటి కలయికలోనే ఉంటుంది. చిత్రానికి ఈ కథ అందిస్తున్నందుకు చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను’’ అన్నారు.

RKFI ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలని నిర్మిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ నటిస్తున్న KH 234, శివకార్తికేయన్ , సాయి పల్లవి నటిస్తున్న RKFI 51, శిలంబరసన్ ప్రధాన పాత్రలో RKFI 56 చిత్రాలు రూపొందుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular